: నెం. 1 ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌

బంగ్లాదేశ్ ఆల్ రౌండ‌ర్ షాకిబ్ అల్ హాస‌న్ ర్యాంక్‌ను దాటేసి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండ‌ర్‌గా మొద‌టి ర్యాంకును రవీంద్ర జ‌డేజా చేజిక్కించుకున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన కొలంబో టెస్ట్‌, గాలే టెస్టులు ర‌వీంద్ర జ‌డేజా మెరుగైన ర్యాంకును చేరుకునేందుకు దోహ‌ద‌ప‌డ్డాయి. జ‌డేజా నెం.1 స్థానాన్ని చేరుకోవ‌డం త‌న కెరీర్‌లో ఇదే మొద‌టిసారి. 438 పాయింట్ల‌తో జ‌డేజా మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, 431 పాయింట్ల‌తో షాకిజ్ రెండో స్థానంలో, 418 పాయింట్ల‌తో మ‌రో భార‌త ఆట‌గాడు అశ్విన్ మూడో స్థానంలో నిలిచారు.

బ్యాటింగ్ ర్యాంకుల్లో మొద‌టి స్థానంలో స్టీవ్ స్మిత్‌, రెండో స్థానంలో జోయి రూట్‌, మూడో స్థానంలో చ‌టేశ్వ‌ర్ పూజారాలు నిలిచారు. విరాట్ కొహ్లీ ఐదో స్థానంలో, అజింక్య రెహానే ఆరో స్థానంలో ఉండ‌గా జ‌డేజా తొమ్మిదో ర్యాంకును ద‌క్కించుకున్నాడు. ఇక బౌల‌ర్ ర్యాంకింగ్‌లో జ‌డేజా మొద‌టి ర్యాంకు సాధించ‌గా జేమ్స్ ఆండ‌ర్స‌న్‌, అశ్విన్‌లు త‌ర్వాతి స్థానాల్లో నిలిచారు. ఇత‌ర భార‌త బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, ఉమేశ్ యాద‌వ్‌లు వ‌రుస‌గా 20, 22 ర్యాంకుల్లో నిలిచారు.

More Telugu News