sekhar kammula: అలా చేస్తే అడుక్కున్నట్టుగా ఉంటుంది : శేఖర్ కమ్ముల

అందమైన .. ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంగా 'ఫిదా' మంచి మార్కులు కొట్టేసింది. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తూ వుండటం పట్ల శేఖర్ కమ్ముల ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఫిల్మ్ స్కూల్లో చదువుకున్న శేఖర్ కమ్ముల, 'డాలర్ డ్రీమ్స్' చిత్రంతో తన కెరియర్ ను ఆరంభించారు. తెలుగు .. ఇంగ్లిష్ భాషల్లో ఆయన ఈ సినిమాను తెరకెక్కించారు.

 చదువు తరువాత కూడా అమెరికాలోనే వుండుంటే ఆస్కార్ అందుకునే లెవెల్ కి వెళ్లేవారా? అనే ప్రశ్న తాజాగా ఆయనకి ఎదురైంది. హాలీవుడ్ సినిమా తనకి తెలియని నేటివిటీ చుట్టూ తిరుగుతుందనీ .. నేటివిటీ తెలియని సినిమా తీస్తే అడుక్కున్నట్టుగా ఉంటుందని చెప్పారు. అందువలన అక్కడ కూడా మన నేటివిటీకి సంబంధించిన కథ మాత్రమే చెప్పగలనని అన్నారు. మన నేటివిటీతో కూడిన సినిమాలు మాత్రమే చేయగలనని చెప్పారు.  

More Telugu News