: సీపీఎల్ లో ఫాబియన్ సూపర్బ్ క్యాచ్... తాము చూసిన అద్భుత క్యాచ్ ఇదేనంటున్న క్రికెట్ ప్రేమికులు... మీరూ చూడండి!

క్రికెట్ మైదానంలో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు చక్కటి డైవ్ లతో క్యాచ్ లు పట్టడం అందరూ చూసేదే. ఒక్కోసారి నమ్మశక్యం కాని రీతిలో పరుగులు పెడుతూ అందదనుకునే బాల్స్ ను కూడా అందుకుంటారు. 1975 వరల్డ్ కప్ సెమీస్ లో కపిల్ పట్టుకున్న క్యాచ్ నుంచి... జాంటీ రోడ్స్, మహ్మద్ కైఫ్, రవీంద్ర జడేజా వంటి వారి క్యాచ్ లు క్రీడాభిమానులను ఎంతో అలరించాయి. వాటన్నింటినీ మించి పోయే క్యాచ్ ఇది. గాల్లోకి కొట్టిన బంతిని అద్భుతరీతిలో ఎగిరి దుమికి అందుకుంటూ సుమారు 10 అడుగుల దూరానికి పైగా గాల్లోనే విన్యాసం చేసిన ఫాబియన్ అలెన్ ఇప్పుడు తాజా సెన్సేషన్ గా మారాడు.

కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ-20 పోటీల్లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, గయానా అమేజాన్ వారియర్స్ జట్ల మధ్య పోటీ జరుగగా, సబ్ స్టిట్యూట్ గా వచ్చిన ఫాబియన్ అసాధ్యమనుకునే క్యాచ్ పట్టుకున్నాడు. దాని వీడియో వైరల్ కాగా, క్రికెట్ చరిత్రలో ఇన్ క్రెడిబుల్ క్యాచ్ లుగా ఇది మిగిలిపోతుందని విశ్లేషకులు అంటుంటే, తాము చూసిన అద్భుత క్యాచ్ ఇదేనని క్రికెట్ ప్రేమికులు చెబుతున్నారు. ఆ క్యాచ్ ని మీరూ చూడండి!

More Telugu News