: బ్రాందీ, విస్కీ వదిలి బీర్ వైపు మందుబాబుల పరుగులు!

ఆంధ్రప్రదేశ్ లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. వేసవికి ముందు వరకూ సగటున రోజుకు రూ. 40 కోట్ల విలువైన అమ్మకాలు సాగుతుండగా, జూలైలో సగటున రూ. 50 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. జూలైలో రూ.1,574.92 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని, గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగిందని, రోజుకు సగటున ఖజానాకు రూ. 10 కోట్ల ఆదాయం చేరిందని అధికారులు చెబుతున్నారు.

ఇక వేసవితో పోలిస్తే బీర్ విక్రయాలు గణనీయంగా పెరుగగా, ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) అమ్మకాలు తగ్గడం గమనార్హం. జిల్లాల వారీ అమ్మకాలు పరిశీలిస్తే, మద్యం విక్రయాల్లో విశాఖపట్నం తొలి స్థానంలో ఉండగా, ఆపై తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు నిలిచాయి. జూలైలో మొత్తం 47,480 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రమంతా అమ్ముడైన మద్యంలో అత్యధిక శాతం ఆదాయం... అంటే 42.0 శాతం నాలుగు జిల్లాల నుంచే వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అమ్మకాలు బాగున్నాయని, నెల్లూరు, ప్రకాశం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఐఎంఎల్ విక్రయాలు తగ్గగా, బీర్ విక్రయాలు పెరిగాయని అన్నారు.

More Telugu News