kamal: వెయ్యికోట్ల 'మహాభారతం'లో కమలహాసన్?

వివిధ భాషల్లో 'మహాభారతం' సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించడానికి చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ప్రముఖ వ్యాపార వేత్త బీఆర్ శెట్టి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, శ్రీ కుమార్ మీనన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

బహు భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది కనుక .. ఆయా భాషలకి చెందిన నటీనటులను ఎంపిక చేసే పనిలో వున్నారు. ఇప్పటికే భీముడిగా మోహన్ లాల్ ను తీసుకున్నారు. మరికొన్ని పాత్రల కోసం అమితాబ్ .. హృతిక్ రోషన్ .. నాగార్జున .. సూర్యలను సంప్రదించినట్టుగా సమాచారం. ఇక మరొక కీలకమైన పాత్ర కోసం కమల్ ను తీసుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరిక కమల్ ఏమంటాడో చూడాలి. ఈ భారీ సినిమాకి ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.     

More Telugu News