: శ్రీలంకపై వరుసగా రెండు సిరీస్‌లలో టీమిండియా గెలుపు.. ధోనీ వల్ల కానిది కోహ్లీతో నెరవేరింది

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయాల బాటలో నడుస్తోంది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో టెస్ట్ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్న కోహ్లీ సేన మరో అరుదైన ఘనత సాధించింది. లంకపై వరుసగా రెండు సిరీస్‌లను గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు. భారత్‌కు ప్రపంచ వన్డే కప్, టీ20 ప్రపంచ కప్‌లు అందించిన మాజీ కెప్టెన్ ధోనీకి కూడా ఇది సాధ్యం కాలేదు. ఆతిథ్య దేశంపై ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం కూడా భారత్‌కు ఇదే తొలిసారి. కాగా, కొలంబోలో జరిగిన టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, ఫాలో ఆన్‌లో 386 పరుగులకు ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

More Telugu News