: ఆమె పిల్ల కాదు తల్లి అని తెలుసుకుని వదిలేసిన కిడ్నాపర్లు!

బ్రిటన్ లో ఇద్దరు వ్యక్తులు ఓ మోడల్ ను కిడ్నాప్ చేసి ఇంటర్నెట్ వేదికగా అమ్మేద్దామనుకుని చివర్లో ఫెయిలయ్యారు. తాము కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది... పిల్ల కాదు, తల్లి అనుకుని ఆమెను విడుదల చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ప్రకటనకు సంబంధించి మిలాన్ లో ఫోటో షూట్ లో పాల్గొనేందుకు 20 ఏళ్ల మోడల్ ఓ అపార్ట్ మెంట్ కు వెళ్లింది. అక్కడ లుకాజ్ హెర్బా, అతని సహాయకుడు ఆమెకు కెటమైన్ అనే మత్తుమందు ఇంజెక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఆ మోడల్ ను వివస్త్రను చేశారు. ముఖాన్ని దిండుతో, నోటిని ప్లాస్టర్ తో కప్పేశారు. అక్కడి నుంచి ఆమెను మరో ప్రాంతానికి తరలించి బంధించేశారు.

ఆమె ఫోటోను ఓ వెబ్ సైట్ లో ఉంచి వేలం ప్రకటించారు. ప్రారంభ ధరగా 3,53,000 డాలర్లు ఖరారు చేశారు. మన కరెన్సీలో అయితే రూ.2.24 కోట్లు. ఆ యువతి పని చేస్తున్న మోడలింగ్ ఏజెన్సీని కూడా సంప్రదించి 3,00,000 డాలర్లు ఇస్తే ఇంటర్నెట్ లో వేలం ఆపేస్తామని ఆఫర్ ఇవ్వడం విశేషం. అయితే, అంతలోనే సదరు మోడల్ కు పెళ్లయిందని, ఆమెకు రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుసుకున్న హెర్బా ఆమెను విడుదల చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే, చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు, 50,000 డాలర్లను బిట్ కాయిన్ల రూపంలో నెలాఖరు లోగా చెల్లించేందుకు ఒప్పందంపై సంతకం చేయించుకుని మరీ విడిడి పెట్టాడు. ఎందుకంటే, కిడ్నాపర్లు పాటించే నిబంధనల ప్రకారం తల్లులను కిడ్నాప్ చేయకూడదు. ఆ మోడల్ ఇచ్చిన సమాచారంతో  పోలీసులు హెర్బా, అతడి అనుచరుడిని  అరెస్ట్ చేశారు.

More Telugu News