: ఫ్లెక్సీ ఫేర్ విధానంతో రైల్వేకి ఏడాదిలో టికెట్లపై రూ.540 కోట్ల ఆదాయం

ఫ్లెక్సీ ఫేర్ విధానం రైల్వేకు కాసులు కురిపిస్తోంది. ఈ పథకాన్ని రైల్వే శాఖ గతేడాది సెప్టెంబర్ 9న ప్రారంభించింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లకు దీన్ని అమలు చేస్తున్నారు. మొత్తం సీట్లలో 10 శాతం సీట్లను సాధారణ ధరకే విక్రయిస్తారు. ఇక ఆ తర్వాత నుంచి ఫ్లెక్సీ ఫేర్ మొదలవుతుంది. ప్రతీ 10 శాతం సీట్లకు 10 శాతం చొప్పున ధర పెంచి అమ్ముతారు. చివర్లో టికెట్లు కొనుగోలు చేసే వారు గరిష్టంగా 50 శాతం అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రయాణికుల జేబులకు చిల్లు పడుతుండగా, రైల్వే ఖజానాకు మాత్రం ఇప్పటి వరకు అదనంగా రూ.540 కోట్ల ఆదాయం వచ్చి చేరింది. ‘‘ఫ్లెక్సీ ఫేర్ తో అదనపు ఆదాయం వచ్చింది. దీన్ని నిలిపివేయడానికి ఎటువంటి కారణం లేదు. ప్రయాణికులు సైతం విముఖత చూపడం లేదు’’ అని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

More Telugu News