kajal: హీరోయిన్ సోదరుడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్!

అందాల కాజల్ అగర్వాల్ తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా వున్నప్పటికీ, బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ ఆఫర్ ను అమ్మడు వదులుకోలేకపోయిందట. 'ఖూన్ మై హై' పేరిట రూపొందుతున్న ఈ లఘు చిత్రంలో కాజల్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సోదరుడు అపర శక్తి హీరోగా నటించాడు. విశేషం ఏమిటంటే, బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సోదరుడు కుష్ సిన్హా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 'ఢిల్లీకి చెందిన ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య సాగే చక్కని ప్రేమకథ ఇది. ఢిల్లీ యువత మనస్తత్వాలు, ఆలోచనా దృక్పథం ఇందులో చూపించడం జరిగింది' అని చెప్పాడు దర్శకుడు సిన్హా. కేవలం పద్దెనిమిది గంటల్లోనే ఈ లఘు చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు.          

More Telugu News