: ఫేస్ బుక్ పోస్ట్ తో రెండున్నర గంటల్లోనే రూ.16 లక్షలు... ఓ బాధితురాలికి అందిన సాయం

ఓ యాసిడ్ దాడి బాధితురాలి భవిష్యత్తుకు ఫేస్ బుక్ బంగారు బాటను పరిచింది. తను, తన కుమార్తె భవిష్యత్తుకు భరోసానిచ్చింది. ఫేస్ బుక్ వేదికగా దాతల పెద్ద మనసుతో కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే ఆమెకు రూ.16.5 లక్షల విరాళాలు వచ్చి పడ్డాయి. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని నేరుల్ నివాసి మబియా మండల్ పై ఐదేళ్ల క్రితం స్వయంగా ఆమె భర్తే యాసిడ్ దాడికి పాల్పడ్డాడు.

శ్రేయోభిలాషులు అందించిన సహకారంతోను, స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రి వారు ఉచితంగా చికిత్స చేయడంతోను ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె వయసు 25 ఏళ్లు. అయితే, మరిన్ని సర్జరీలు ఆమెకు చేయాల్సి ఉంది. ఇందుకోసం నిధులు అవసరం. అందుకని ఫేస్ బుక్ లో ఆమె పరిస్థితి గురించి తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ఈ బాధ్యతను హ్యామన్స్ ఆఫ్ బాంబే గ్రూపు తీసుకుంది. దాంతో రెండున్నర గంటల్లోనే రూ.16.5 లక్షల విరాళాలు వచ్చాయి. వీటిలో సర్జరీకి ఖర్చులు పోను ఇంకా నిధులు కావాల్సి ఉంటే మరోసారి ప్రచారం నిర్వహిస్తామని స్వచ్చంద సంస్థ వ్యవస్థాకులు కరిష్మా మెహతా తెలిపారు.

More Telugu News