ashok. esha: 'దర్శకుడు' బాగానే సందడి చేస్తున్నాడు!

సుకుమార్ తన అన్నయ్య తనయుడు అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ, 'దర్శకుడు' సినిమాను నిర్మించాడు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అశోక్ జోడీగా ఈషా రెబ్బా నటించింది. భారీ స్థాయిలో ప్రచారం హడావిడితో నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని ప్రాంతాలనుంచి వస్తోన్న రెస్పాన్స్ సూపర్బ్ అంటూ ఈ సినిమా టీమ్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

 దర్శకుడు హరిప్రసాద్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడనీ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని సుకుమార్ చెప్పాడు. నటన పరంగా అశోక్ కు .. ఈషాకు మంచి మార్కులు పడుతున్నాయని అన్నాడు. 'కుమారి 21 F' తరువాత ఇంతమంచి సినిమాను నిర్మించినందుకు సంతోషంగా .. సంతృప్తిగా ఉందని చెప్పాడు. సుకుమార్ ఈ స్థాయిలో చేస్తోన్న సందడి సినిమా వసూళ్లను మరింత పెంచుతుందేమో చూడాలి.     

More Telugu News