: ‘బిగ్ బాస్’కు ప్రత్యేక అతిథిగా రానా దగ్గుబాటి!

రేపు ప్రసారం కానున్న తెలుగు ‘బిగ్ బాస్’ షో కు మొట్టమొదటి ప్రత్యేక అతిథిగా రానా దగ్గుబాటి హాజరుకానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోముంబయి ఎయిర్ పోర్ట్ లో తెల్ల లుంగీ, తెల్ల చొక్కా, కళ్ల జోడు ధరించి స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్న రానా ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో రానా ఏ గెటప్ లో అయితే ఉన్నాడో, అదే గెటప్ లో ఎయిర్ పోర్టులో కనిపించాడు. ఇదిలా ఉండగా, ‘బిగ్ బాస్’ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News