: ర‌హ‌దారిపై రైనో.... హ‌డ‌లిపోయిన వాహ‌న‌దారులు... వీడియో చూడండి!

సాధార‌ణంగా వ‌న్య‌ప్రాణులు రోడ్ల మీదికి రావ‌డం చూస్తూనే ఉంటాం. అలాగే అస్సాం వ‌న్య‌ప్రాణి కేంద్రంలోని ఖ‌డ్గ‌మృగం కూడా ర‌ద్దీగా ఉన్న రోడ్డు మీదికి వ‌చ్చింది. దీంతో ఆ దారిన పోయే వాహ‌నదారులు హ‌డ‌లిపోయి వారి వాహ‌నాల‌ను వెన‌క్కి తిప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వార్తాఛాన‌ల్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. వాహ‌నాల‌తో రైనో ప‌రుగుపందెంలో పాల్గొంటుందా? అన్న‌ట్లుగా ఉన్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. రైనో దాడి చేస్తుందేమోన‌ని దానికి ఎదురుగా వ‌స్తున్న వావానాల‌న్నీ వెనక్కి వెళ్తూ క‌నిపించాయి. ఒక వాహ‌న‌దారుడు వేగంగా వెళ్ల‌లేక రైనో దాడిని తృటిలో త‌ప్పించుకున్నాడు.

More Telugu News