pavankalyan: సంక్రాంతి బరిలోకి పవన్ కల్యాణ్ కూడా దిగేస్తున్నాడు!

త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో సినిమా కొంతవరకూ పూర్తయింది. ఈ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా వున్నారు. పవన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్న ఈ సినిమాకి 'ఇంజనీర్ బాబు' టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 10 లేదా 11 తేదీల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

10 .. 11 తేదీల్లో విడుదల చేయడం వలన లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఆ స్థాయి వసూళ్లను సాధించాలంటే లాంగ్ వీకెండ్ అవసరం. ఆ తరువాత సంక్రాంతి సెలవులు ఎలాగూ కలిసొస్తాయి. అయితే సంక్రాంతి పండుగకి రావడానికి ఇప్పటికే బాలకృష్ణ .. మహేశ్ బాబు .. చరణ్ రెడీ అవుతున్నారు. ఇక పవన్ కూడా రంగంలోకి దిగుతున్నాడంటే, ఈ సారి పోటీ ఒక రేంజ్ లో ఉంటుందన్న మాట.  

More Telugu News