: వలసదారులకు వరమిచ్చానని చెబుతూనే మెలిక పెట్టిన డొనాల్డ్ ట్రంప్!

‘రైజ్‌’(రిఫార్మింగ్‌ అమెరికన్‌ ఇమిగ్రేషన్‌ ఫర్‌ స్ట్రాంగ్‌ ఎంప్లాయ్‌మెంట్‌) బిల్లుకు మద్దతు తెలిపి, గ్రీన్ కార్డుల జారీలో సరికొత్త విధానం అమలు చేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెలిక పెట్టారు. గ్రీన్ కార్డులు జారీ అయినా ఐదేళ్ల పాటు ప్రభుత్వ సాయం ఉండదని తెలిపారు. ప్రతి వారం నిర్వహించే రేడియో, వెబ్ ద్వారా ఆయన దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, గ్రీన్ కార్డు కావాలనుకున్న ప్రతిభావంతులు ముందుగా ఐదేళ్లపాటు తమ సంక్షేమ పథకాలను అడగటం కానీ, వినియోగించుకోవడం కానీ చేయబోమని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

అమెరికన్ కాంగ్రెస్ లో తాను చెప్పినట్టు అమెరికా ఉన్నతంగా కలలు కంటోందని, సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్తుందని ఆయన చెప్పారు. కాగా, సుదీర్ఘ కాలంగా అమెరికా గ్రీన్‌కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి స్వస్తి పలికి, ఇకపై ఆంగ్ల భాషా నైపుణ్యం, ఉన్నత విద్య, అధిక వేతనం, వయసు ప్రాతిపదికగా తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఈ రైజ్ బిల్లు వల్ల భారతీయులు లాభపడతారని అంతా ఆశిస్తున్నప్పటికీ...ఇలాంటి మెలికలు ఇంకెన్ని పెడతారోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధానాలు వలస విధానాలను అడ్డుకుంటుందని ఎన్నికల సమయంలోనే పరిశీలకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. 

More Telugu News