: అమెరికాలోని ఓ పట్టణాన్ని కొనేసిన గంజాయి కంపెనీ.. గంజాయి ప్రియులకు ఆతిథ్య కేంద్రంగా మార్చే వ్యూహం!

అమెరికాకు చెందిన ఓ గంజాయి కంపెనీ కాలిఫోర్నియా ఎడారి పట్టణం మొత్తాన్ని కొనుగోలు చేసింది. అక్కడ గంజాయి పండించి దానిని కన్నాబిస్ (గంజాయి) ఆతిథ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు మరిజువానా కంపెనీ అయిన అమెరికన్ గ్రీన్ పేర్కొంది. నిప్టన్ పట్టణంలో 80 ఎకరాలను తమ నియంత్రణలోకి తీసుకున్నామని, అందులో ఓల్డ్ వెస్ట్-స్టైల్ హోటల్, అందమైన ఇళ్లు, కార్వన్ పార్రక్, కాఫీ షాప్ ఉన్నట్టు పేర్కొంది.

కాలిఫోర్నియా-నెవడాకు మధ్య ఉన్న గోల్డ్ రష్ పట్టణాన్ని కన్నాబిస్ ఫ్రెండ్లీ హాస్పిటాలిటీ డెస్టినేషన్‌గా మార్చనున్నట్టు వివరించింది. ఇక్కడ గంజాయిని విక్రయిస్తామని పేర్కొంది. ఈ పట్టణ ప్రస్తుత యజమాని నెలకొల్పిన సోలార్ ఫామ్స్‌ను క్రమంగా విస్తరిస్తామని వివరించింది. కాగా, ఈ పట్టణానికి సంబంధించిన డీల్ ఎంతకు కుదిరిందన్న విషయాన్ని ప్రస్తుత ఓనర్ రోగ్జానే లంగ్ వెల్లడించేందుకు నిరాకరించారు. అయితే గతేడాది దీనిని 5 మిలియన్ డాలర్లకు అమ్మకానికి పెట్టారు.

More Telugu News