: డ్రగ్ డాన్, నెదర్లాండ్ పౌరుడు మైక్ కమింగ హైదరాబాదు అల్లుడే.. నానక్ రామ్ గూడ లోనే నివాసం!

హైదరాబాదులో తీగలాగితే కదిలిన డ్రగ్స్ డొంకలో పట్టుబడ్డ డ్రగ్ మాఫియా డాన్, నెదర్లాండ్స్ పౌరుడైన మైక్ కమింగ హైదరాబాద్ అల్లుడని, పాతబస్తీకి చెందిన యువతిని వివాహం చేసుకుని, నానక్ రామ్ గూడలో కాపురం పెట్టాడని సిట్ అధికారులు గుర్తించారు. రిమాండ్ ఖైదీగా ఉన్న మైక్ కమింగను సిట్ అధికారులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా అతనిని విచారించి పలు విషయాలు రాబట్టారు. ఏడేళ్లుగా అతను హైదరాబాదులో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే పాతబస్తీ యువతిని వివాహం చేసుకుని కాపురం పెట్టాడు. వీరికి మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. నెదర్లాండ్స్ నుంచి ఖరీదైన డీఎంటీ డ్రగ్ (డీమీథైల్ ట్రైప్టమైన్) ను తెప్పించుకుని కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌ వేర్ ప్రొఫెషనల్స్ కు అమ్మేవాడని సిట్ అధికారులు తెలుసుకున్నారు. డ్రగ్స్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ జల్సాలు చేస్తున్నాడని విచారణలో వారు తెలుసుకున్నారు. 

More Telugu News