: మా సహనం నశిస్తోంది... తక్కువ అంచనా వేయద్దు!: భారత్ కు చైనా తీవ్ర హెచ్చరిక

డోక్లామ్‌ వివాదం చర్చల ద్వారా పరిష్కారమవుతుందని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటించిన వెంటనే చైనా రక్షణ ప్రతినిధి రెన్‌ గ్యోక్వియాంగ్‌ రంగంలోకి దిగారు. భారత్ కు హెచ్చరికలు చేస్తూ, డోక్లామ్‌ వివాదాన్ని పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నారని, తమ సహనం నశిస్తోందని, చైనా సైనిక బలగాల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దని భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. చైనా సౌర్వభౌమత్వం, దేశాభివృద్ధి, భద్రత విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోగల దృఢనిశ్చయం తమకు ఉందని, తమ భూభాగాన్ని, సార్వభౌమత్వాన్ని చైనా బలగాలు ఎల్లప్పుడూ కాపాడతాయని ఆయన స్పష్టం చేశారు.

భారత్‌-చైనా-భూటాన్‌ ట్రైజంక్షన్‌ వద్ద చైనా నిర్మిస్తున్న రహదారిని చూసి భారత్‌ భయపడుతోందని, ఆ రహదారి నిర్మాణం పూర్తయితే భారత్‌ కు ఈశాన్య రాష్ట్రాలతో ఉన్న సంబంధాలు ఎక్కడ తెగిపోతాయో అని ఆందోళన చెందుతోందని ఆయన విమర్శించారు. ఈ వివాదం నడుస్తున్నప్పటి నుంచి చైనా భారత్‌ తో శాంతిపూర్వక చర్చలు జరిపేందుకు ప్రయత్నించిందని చెప్పిన ఆయన, ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించాలని, సరిహద్దులో ఉన్న చైనా సైనిక బలగాలు శాంతంగా ఉన్నాయని, అయితే ఆ ఓపిక చివరి దశకు చేరుకుందని ఆయన తెలిపారు.

More Telugu News