: బెంగళూరులో 'హెలీ ట్యాక్సీ' సేవలు ప్రారంభం!

దేశంలో మొట్టమొదటిసారిగా హెలీ ట్యాక్సీ సేవలు బెంగళూరులో అందుబాటులోకి వచ్చాయి. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ) నుంచి హెలీ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విమానయాన శాఖ రాష్ట్ర మంత్రి జయంత్‌ సిన్హా ఈ రోజు ప్రారంభించారు. ఒక హెలీకాప్టర్‌లో ఐదుగురు, మరో హెలీకాప్టర్‌లో 13 మంది ప్రయాణించవచ్చు. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు హెలికాప్టర్ల సంఖ్య పెంచే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.

కాగా, బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్‌ సిటీతోపాటు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలంటే కనీసం రెండు గంటలు ముందుగా బయలుదేరాలి. దీంతో, ప్రయాణికుల ఇబ్బందులను గమనించి హెలీ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు సమాచారం. పీణ్య, ఎలక్ట్రానిక్‌ సిటీ తో పాటు పలు ప్రాంతాలకు రెండు హెలీ ట్యాక్సీల ద్వారా సేవలు అందజేయనున్నారు.

More Telugu News