: యాంత్రిక వైఫ‌ల్యం వ‌ల్ల అర‌గంట‌పాటు గాల్లో త‌ల‌కిందులుగా వేలాడిన బంగీ జంప‌ర్‌... వీడియో చూడండి!

స‌ర‌దాగా స్నేహితుల‌తో క‌లిసి ఎగ్జిబిష‌న్‌లో బంగీ జంప్ చేద్దామ‌ని వెళ్లాడు. అప్ప‌టికీ రెండు సార్లు బంగీ జంప్ చేశాడు. మూడో సారి చేస్తుండ‌గా బంగీ జంప్ మిష‌న్‌లో యాంత్రిక వైఫ‌ల్యం వ‌ల్ల గాల్లో వేలాడుతూ ఉండిపోయాడు. అర‌గంట త‌ర్వాత ఫైర్ ఇంజిన్ వాళ్లు వ‌చ్చి ర‌క్షించ‌డంతో ఊపిరి పీల్చుకున్నాడు. అమెరికాలోని లాస్ ఏంజెలీస్‌లో వెంచ‌ర్ కౌంటీ ఫైర్‌లో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. అదే ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల‌ రోజ‌ర్ రోడ్రిగేజ్ బంగీ జంప్ చేస్తూ యాంత్రిక వైఫల్యం వల్ల ఎటూ కాకుండా గాల్లోనే అర‌గంట పాటు త‌ల‌కిందులుగా వేలాడాడు. ఎగ్జిబిష‌న్ సిబ్బంది కాపాడేందుకు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌క‌పోవ‌డంతో ఫైర్ ఇంజిన్ వారిని రంగంలోకి దించారు. వారు మంట‌లు ఆర్ప‌డానికి ఉప‌యోగించే పొడ‌వైన నిచ్చెన స‌హాయంతో రోజ‌ర్‌ను సుర‌క్షితంగా కాపాడ‌గ‌లిగారు.

More Telugu News