pavan: ఆగస్టు 15న పవన్ మూవీ ఫస్టులుక్?

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఇంజనీర్ బాబు' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమైనా ఇంతవరకూ ఫస్టు లుక్ బయటికి రాకపోవడంతో, దాని కోసం పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ ను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి కూడా పవన్ కి దేశభక్తి ఎక్కువే. అందువలన ఆ రోజున ఫస్టు లుక్ ను వదలడానికి ఆయన ఆసక్తిని చూపుతున్నాడట. త్వరలో ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే ఈ లోగా టైటిల్ ను ఫిక్స్ చేస్తారా? .. ఒక్క లుక్ మాత్రమే వదులుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

More Telugu News