: చైనా స‌హాయంతో పీఓకేలో ఆరు డ్యాంలు నిర్మిస్తున్న పాకిస్థాన్: భార‌త విదేశాంగ శాఖ‌

పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో సింధు న‌దిపై పాకిస్థాన్ ఆరు డ్యాంలు నిర్మిస్తోంద‌ని భారత విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. ఇందుకు పాకిస్థాన్‌కు చైనా స‌హ‌క‌రిస్తుంద‌ని పార్ల‌మెంట్‌కు తెలియ‌జేసింది. ఈ డ్యాంలు నిర్మించ‌డంలో పాకిస్థాన్‌కు స‌హాయం చేస్తాన‌ని చైనా గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తిని విదేశాంగ శాఖ స‌హాయ మంత్రి వీకే సింగ్ పార్ల‌మెంట్‌కు గుర్తుచేశారు. పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో పాకిస్థాన్ చేప‌డుతున్న ప్రాజెక్టులు భార‌త సార్వ‌భౌమ‌త్వానికి, స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిస్తాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అందుకు సంబంధించి భార‌త మిల‌ట‌రీ ద్వారా చైనా, పాకిస్థాన్‌ల‌కు తెలియ‌జేసేలా విదేశాంగ శాఖ చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని ఆయ‌న వివ‌రించారు. ఈ ప్రాంతంలో పాకిస్థాన్ డ్యాంలు నిర్మించ‌డం వ‌ల్ల భార‌త దేశానికి భ‌ద్ర‌త ప‌ర‌మైన స‌మ‌స్య‌లు రానున్నాయ‌ని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.

More Telugu News