: నంద్యాల సభలో కేటీఆర్ ను ఫాలో అయిన జగన్!

నిన్న నంద్యాలలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అసంఖ్యాక వైఎస్ఆర్ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్, ఓ పిట్ట కథ చెప్పారు. దీన్ని విన్న వారందరికీ గతంలో ఎక్కడో ఇదే స్టోరీ విన్నామే అనిపించింది. వాస్తవానికి తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి ఓ బహిరంగ సభలో దీన్ని చెప్పి అందరినీ నవ్వించారు. అదే కథను జగన్ నంద్యాలలో చెప్పారు. ఇంతకీ ఆ కథేంటో తెలుసా?...

ఒక ఊరిలో పలు రకాల వ్యవసానాలకు బానిసైన 17 ఏళ్ల కుర్రాడు, తాగిన మత్తులో ఇంట్లో దొంగతనం చేస్తుండగా తల్లి చూసింది. ఇది తప్పని చెప్పబోయిన ఆమెను, రోకలి బండతో కొట్టి చంపాడు. దాన్ని చూసిన తండ్రి ప్రశ్నించగా, ఆయనను కూడా కొట్టి చంపాడు. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి అతను చేసిన నేరాలు విని ఆశ్చర్యపోతూ సొంత తల్లిదండ్రులనే చంపిన నీకు ఏ శిక్ష విధించాలో చెప్పమని అడిగారు. అప్పుడు విలపిస్తూ, తల్లిదండ్రులు లేని పిల్లవాడినని, తనను విడిచిపెట్టాలని అడిగాడట. ఇప్పుడు తెలుగుదేశం వైఖరి కూడా అలాగే ఉందని జగన్ అన్నారు. ఇదే కథను గతంలో కేటీఆర్ చెప్పి ఉండటం గమనార్హం.

More Telugu News