: అనాథ శవానికి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించిన ఆస్ట్రేలియా యువతి!

అనాథ శవానికి అన్నీ తానై తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించిన ఆస్ట్రేలియా యువతి అందర్నీ ఆకట్టుకుంటోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...ఆస్ట్రేలియాకు చెందిన జార్జియా సికింద్రాబాద్ లోని కార్ఖానాలో ఉన్న 'సర్వ్ నీడీ' స్వచ్ఛంద సేవాసంస్థ నిర్వహిస్తున్న 14 కార్యక్రమాల గురించి తెలుసుకునేందుకు వచ్చింది. కామెడీ, లాంగ్‌ స్విమ్మింగ్, వాయిస్‌ ప్లే వంటి కార్యక్రమాల ద్వారా ఆస్ట్రేలియాలో సేకరించిన డబ్బుతో ఇక్కడి అనాధ పిల్లలకు సాయమందిస్తోంది.

 ఈ క్రమంలో హైదరాబాదులోని ఒక షెల్టర్ హోంలో అనాథ మహిళ మృతిచెందిన సమాచారం అందింది. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు 'సర్వ్ నీడీ' వ్యవస్థాపకుడు సిద్ధం కావడంతో జార్జియా ముందుకు వచ్చింది. ఆమె అంత్యక్రియలు తాను నిర్వహిస్తానని చెప్పింది. దీంతో హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. జార్జియా మృతిచెందిన మహిళకు తలకొరివిపెట్టింది. అనంతరం ఆమె మాట్లాడుతూ, ‘‘మనిషికి వీడ్కోలు పలికే సమయంలో ఇక్కడి ఆచారాలు, పద్ధతులు చాలా గొప్పగా అనిపించాయి. బతికున్నప్పుడే కాదు, చనిపోయాక కూడా ఆ మనిషికి విలువ ఇచ్చే సంస్కృతి చాలా నచ్చింది’’ అని తెలిపింది. 

More Telugu News