: ఇదేమీ, కేసీఆర్ అయ్య జాగీర్ కాదు, అడ్డగోలుగా ప్రవర్తించడానికి!: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్లలో పదకొండు మందిపై దాడి జరిగితే అందులో నలుగురు మాత్రమే దళితులు ఉన్నారని..ఈ విషయాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని అధికారపక్ష నేతలు అనడంపై  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ విషయమై ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ సమాధానమిస్తూ, ‘దళితులు కాని వాళ్లపై పోలీసులు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టవచ్చా? ముఖ్యమంత్రి చెప్పే సమాధానమిదా? అసలు, ఈ విధంగా మాట్లాడుతున్నవారికి కామన్ సెన్స్ ఉందా?  ఏ కులం వారినైనా సరే, అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుని టార్చర్ పెట్టి, కరెంట్ షాక్ పెట్టొచ్చా? ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోరు?

ఈ సంఘటనపై ఆ జిల్లా ఎస్పీ.. ‘టార్చర్ చేయమంటేనే చేశామని’ ఆయన చెబుతున్నారు. అందుకే, పోలీసులపై కేసీఆర్ చర్యలు తీసుకోవట్లేదు. ఈ విషయాన్ని మేము వదలిపెట్టం. ఇదేమీ, కేసీఆర్ అయ్య జాగీర్ కాదు..అడ్డగోలుగా ప్రవర్తించడానికి. పోలీసులేమీ ఆయన ప్రైవేట్ సైన్యం కాదు. ఈ విషయమై తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ప్రతిఘటిస్తుంది’ అని ఉత్తమ్ హెచ్చరించారు.

More Telugu News