: సౌదీ అరేబియాలో కూడా ఇకపై బికినీలు వేసుకోవచ్చు!

సౌదీ అరేబియా అంటేనే కఠినమైన చట్టాలు గుర్తుకు వస్తాయి. ఆ దేశంలో మహిళలపై ఆంక్షలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఏ మహిళ అయినా బుర్ఖా లేకుండా బయటకు రావడం ఆ దేశంలో నిషిద్ధం. అంతేకాదు, మహిళలకు డ్రైవింగ్ చేసే అవకాశం కూడా లేదు. కొంత కాలం క్రితమే అక్కడ మహిళలకు ఓటు హక్కును కల్పించారు.

ఈ నేపథ్యంలో శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయానికి ముగింపు పలకాలని ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భావిస్తున్నారు. ప్రస్తుతానికి సౌదీకి విదేశీ మహిళా టూరిస్టులు ఎవరు వచ్చినా సంప్రదాయ దుస్తులను ధరించాలనే నిబంధన ఉంది. అయితే, స్త్రీలు బికినీలు ధరించేందుకు అనుమతి ఇచ్చేందుకు యువరాజు ప్రణాళిక రచిస్తున్నారు. సముద్రతీరంలో ఖరీదైన రిసార్ట్ లను ఏర్పాటు చేసి, అక్కడ మహిళలు బికినీలు వేసుకోవడానికి అనుమతించాలని ఆయన యోచిస్తున్నారు.

దీని వల్ల పర్యాటకులకు ఇబ్బంది ఉండదని, వారి ఆనందానికి భంగం వాటిల్లదని ఆయన భావిస్తున్నారు. దీనివల్ల చమురేతర ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. 2022లోగా ఈ బికినీ రిసార్టులను నిర్మించాలని ఆయన ఆదేశించారు. యువరాజు నిర్ణయం సౌదీలో సంచలనంగా మారింది. సంప్రదాయవాదులు యువరాజు నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. 

More Telugu News