: మరోసారి మసూద్ అజర్ ను వెనకేసుకొచ్చిన చైనా!

జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా మరోసారి చైనా మోకాలొడ్డింది. మసూద్ ను ఉగ్రవాదిగా ప్రకటించాలని, గత సంవత్సరం మార్చిలో భారత్ చేసిన విజ్ఞప్తికి 15 దేశాల ఐరాస కమిటీలో 14 దేశాలు అంగీకరించిన వేళ, చైనా సాంకేతిక కారణాలు చూపుతూ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆగస్టు 2లోగా చైనా తన నిర్ణయాన్ని ప్రకటించాలని యూఎస్ ఆదేశించింది. ఆ తేదీ ముగియడానికి గంటల ముందు తమకు మరో మూడు నెలల సమయం కావాలని కోరింది.

చైనా ఈ పొడిగింపు గడువును కోరుకోకుండా ఉంటే మసూద్ అజర్ ఆటోమేటిక్ గా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపబడి వుండేవాడు. ఈ డెడ్ లైన్ ముగింపు దశకు వచ్చిన వేళ, ఉగ్రవాదికి మద్దతు పలికేలా చైనా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఆక్షేపించింది. కాగా, ఇండియాలో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్న మసూద్ అజర్ ను తమకు అప్పగించాలని, లేదంటే, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News