: షాకింగ్... 'బోన్ లెస్ చికెన్ వింగ్స్' అనుకుని చైనా 'ఎలుక మాంసం' తింటున్న అమెరికన్లు!

అది ఏ మాంసమైనా సరే చైనీయులు దానిని లొట్టలేసుకుని తింటారన్న సంగతి తెలిసిందే. ఈ అలవాటు అమెరికన్లకు కూడా తెలియకుండా అలవాటు చేసేశారు. అదెలా అంటే... శాన్ ఫ్రాన్సిస్కోలోని పోర్టుకు చైనా నుంచి ఒక కంటైనర్ మాంసం వచ్చింది. దీనిని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) పరిశీలించగా అది ఎలుక మాంసమని తేలింది. దీంతో రికార్డులు పరిశీలించగా కంటైనర్లతో టన్నులకొద్దీ ఎలుక మాంసాన్ని అమెరికాకు చైనా ఎగుమతి చేస్తోన్న సంగతి బయటపడింది.

ఇలా అమెరికా చేరుకున్న ఎలుక మాంసాన్ని అమెరికా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు ప్రాసెస్ చేసి ‘బోన్‌ లెస్‌ చికెన్‌ వింగ్స్‌’ పేరుతో రెస్టారెంట్లకు విక్రయిస్తూ, వడ్డిస్తున్నాయి. ఇలా చైనా నుంచి ఏటా నాలుగున్నర లక్షల కేజీల ఎలుక మాంసాన్ని విక్రయిస్తున్నారని ఎఫ్‌డీఏ తెలిపింది. వెంటనే అమెరికన్లకు తెలిసేలా...రెస్టారెంట్లలో బోన్ లెస్ చికెన్ వింగ్స్ వంటకాలను తినవద్దని ప్రకటన జారీ చేసింది. 

More Telugu News