: కీలక వడ్డీ రేట్లపై కోత విధించిన ఆర్బీఐ

కీలక వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత విధించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈరోజు నిర్వహించిన మూడో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ముగిసింది. రెపో రేటు నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుత రెపో రేటు 6.25 శాతం నుంచి 6.0 శాతంగా ఉండనుంది. రివర్స్ రెపో రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంకు రేట్లపై కూడా కోత విధించారు. జీఎస్టీ అమలు, వర్షాల వల్ల గత మూడు నెలల్లో ద్రవ్యోల్బణం తగ్గిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా. కాగా, తాజా సమీక్ష నేపథ్యంలో ప్రస్తుతం పాలసీ రేట్లు..

* రెపో రేటు - 6 శాతం
* రివర్స్ రెపో రేటు - 5.75 శాతం
* మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు - 6.25 శాతం
*  బ్యాంక్ రేటు - 6.25 శాతం

More Telugu News