: మానవ శరీరం గురించిన నమ్మలేని నిజాలివి!

మానవ శరీరం ఎంతో అద్భుత నిర్మాణం. పుట్టుక నుంచి మరణం వరకూ ఎన్నో ఏళ్ల పాటు అవిశ్రాంతంగా పనిచేసే అవయవాల శరీరం. మానవ శరీరం గురించిన కొన్ని ఆసక్తికరమైన, నమ్మలేని నిజాలివి.

* మానవ శరీరంలో 1,00,000 మైళ్ల పొడవైన రక్త నాళాలు ఉంటాయి. చిన్న పిల్లల్లో అయితే, ఇవి 60 వేల మైళ్ల పొడవుంటాయి.
* ఒక రోజులో మనిషి 50 వేల సార్లు ఊపిరి పీలుస్తాడు.
* శరీరంలోని బలమైన కండరం దవడ కండరం.
* శరీరం తనలోని ఒక శాతం నీటిని కోల్పోయినప్పుడు దప్పికగా అనిపిస్తుంది. 5 శాతం నీటిని కోల్పోతే విపరీతమైన అలసట, దాహం వేస్తాయి. 10 శాతం నీటిని కోల్పోతే డీ హైడ్రేషన్ తో ప్రాణం పోతుంది.
* నిద్రలో వచ్చే కలల్లో 90 శాతం వరకూ మెలకువ రాగానే మరచిపోతుంటాం.
* పురుషుల గుండెతో పోలిస్తే మహిళల గుండె వేగంగా కొట్టుకుంటుంది.
* జన్మించక ముందే... అంటే కడుపులో ఉండగానే ఫింగర్ ప్రింట్స్ తయారైపోతాయి. గర్భంలో ఉన్న ఆరో నెలలో ఇవి ఏర్పడతాయి.
* మానవ శరీరంలోని వృథా కణాల్లో ప్రతి నిమిషానికీ 30 కోట్ల కణాలు చనిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతుంటాయి.
* ఏదైనా శరీర అవయవానికి మెదడు సమాచారాన్ని ఇవ్వాల్సి వస్తే, అది గంటకు 268 మైళ్ల వేగంతో పయనిస్తుంది.
* మనిషి మెదడులో కొన్ని లక్షల కంప్యూటర్లలో దాచగలిగినంత మెమొరీని దాచవచ్చు. మెదడులో 2. పెటా బైట్ల (సుమారు పది లక్షల గిగాబైట్లు) సమాచారాన్ని దాచుకోవచ్చు.
* శరీరంలో రక్తం సరఫరా కాని ఒకే ఒక్క భాగం కంటిలో ఉండే కార్నియా.
* శరీరంలో డ్యామేజ్ అయితే, తనంతట తానుగా బాగు చేసుకోలేని అవయవం అంటూ ఏదైనా ఉందంటే అది దంతాలే.
* తల వెంట్రుకలు సగటున నెలకు  అర అంగుళం పెరుగుతాయి. వేసవి కాలంలో, నిద్రిస్తున్న వేళ జుట్టు పెరుగుతూ ఉంటుంది.
* జీవితకాలం పాటు జుట్టును పెరగనిచ్చి, ఒక్కో వెంట్రుకనూ పేర్చుకుంటూ పోతే, 725 కిలోమీటర్ల మేర పరవవచ్చు.
* గోడ వైపు తిరిగి నిలబడి తలను గోడకు ఆనించడం ద్వారా 150 కేలరీల శక్తిని కోల్పోవచ్చు.
* ఊపిరితిత్తులను పూర్తిగా విడదీస్తే, అది 50 నుంచి 75 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పరచుకుంటుంది. ఇది దాదాపు ఓ టెన్నిస్ కోర్టు వైశాల్యంతో సమానం.
* మానవ శరీరంలోని అతిపెద్ద కణం ఆడవారిలో అండం కాగా, అతి చిన్న కణం మగవారి వీర్య కణం.
* వీర్య కణం పొడవు 50 మైక్రో మీటర్లు (సుమారు 0.05 మిల్లీ మీటర్లు) ఉండగా, అండం దానికన్నా 30 రెట్లు పెద్దదిగా కంటికి కనిపించేంతగా ఉంటుంది.

More Telugu News