: అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్... వైరల్ వీడియో చూడండి

ఆకాశంలో ఊహించని విపత్తు ఎదురైతే? ప్రయాణికుల ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వస్తే? అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అద్భుతంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయించిన పైలట్ హీరోగా మారిన ఘటన టర్కీలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... అట్లాస్ గ్లోబల్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఏ320 రకానికి చెందిన విమానం సైప్రస్ నుంచి టర్కీకి 121 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయల్దేరింది. విమానంలోని వెదర్ ఇండికేటర్ పనిచేయడం మానేసింది. టర్కీలోని ఇస్తాంబుల్ కు చేరేసరికి ఒక్కసారిగా బలమైన గాలులు విమానాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. పట్టుకుని ఊపేసినట్టు ఊపేశాయి. దాని నుంచి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకుండా జాగ్రత్త పడేంతలో గోల్ఫ్ సైజ్ లోని వడగళ్లు వచ్చి విమానంపై దాడి చేశాయి.

 ఒక్కసారిగా పైలట్ ముందున్న అద్దం ధ్వంసమైపోసాగింది. కన్నుచించుకున్నా కనపడ్డం లేదు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం 30 ఏళ్ల అనుభవం కలిగిన పైలట్ అలెగ్జాండర్ అకోపోవ్ ఎయిర్ కంట్రోల్ ను సంప్రదించారు. రోడ్డు పక్కనే ఉన్న రన్ వేపై అత్యంత వేగంతో ఏమాత్రం పక్కకు జరగకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. వెనక సీట్లో కూర్చున్న పది మంది గాయపడ్డారు, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అయితే సురక్షితంగా ప్రయాణికులను దించడంతో అంతా అతనిని హీరోగా అభివర్ణిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఆయనను 'ఆర్డర్ ఆఫ్ కరేజ్' పురస్కారంతో గౌరవించనుంది. ఆ వీడియో చూడండి. 

More Telugu News