: చంద్రబాబు మేము చెబితే వినడం లేదు.. 'జగ్గీ' చెపితే వింటారేమో!: రాజేంద్రసింగ్

నదులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయని, వాటిని నాశనం చేస్తే మనిషి మనుగడే కష్టమవుతుందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ అన్నారు. అమరావతి ప్రాంతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను నిర్మించారని... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే నది పరీవాహక ప్రాంతలో నివసిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము చెబితే చంద్రబాబు వినడం లేదని... జగ్గీ వాసుదేవ్ చెబితే వింటారేమో అని అన్నారు.

చంద్రబాబు సింగపూర్ మాటలనే వింటున్నారని... వాళ్లు గాలిలో ఎగురుతారని, మనం భూమి మీద నడుస్తామని చెప్పారు. ఇది స్థానికంగా చేపట్టిన ఉద్యమం కాదని, కృష్ణానది పరిరక్షణ కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుపుకుని పోతామని చెప్పారు. నదులను కాపాడటానికి అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ యాత్ర ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు మద్దూరు, పాపవినాశనం, హంసలదీవి, పెనుమూడి, కొల్లూరు మీదుగా బీజాపూర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు.

More Telugu News