: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన వరల్డ్ బ్యాంక్.. జీలం, చీనాబ్ ఉప నదులపై ఇండియా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

పాకిస్థాన్ కు అవసరమైన తాగు, సాగు నీటిని అందిస్తున్న జీలం, చీనాబ్ నదుల ఉపనదులపై హైడ్రో ఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులను నిర్మించేందుకు భారత్ కు ప్రపంచ బ్యాంక్ అనుమతినిచ్చింది. ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఈమేరకు అనుమతించింది. ఈ నదులపై కొన్ని షరతులకు లోబడి ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చని తెలిపింది. ఇరు దేశాలకు చెందిన సెక్రటరీ లెవెల్ మీటింగ్ లో వరల్డ్ బ్యాంక్ ఈ మేరకు స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టుల డిజైన్ కు సంబంధించి కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ను ఏర్పాటు చేయాలని పాక్ కోరింది. ఈ అంశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఓ న్యూట్రల్ ఎక్స్ పర్ట్ ను నియమించాలని భారత్ కోరింది.

తొమ్మిది సంవత్సరాల పాటు భారత్, పాక్ లతో ప్రపంచ బ్యాంకు చర్చలు జరిపిన తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో అమల్లోకి వచ్చింది. ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో ఈ ట్రీటీ అమలవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ ప్రాంతంలోని నదులకు సంబంధించిన వివాదాలన్నింటిపై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహిస్తోంది. మరోవైపు, భారత్ నిర్మించాలనుకుంటున్న ఈ ప్రాజెక్టును పాక్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా, భారత్ తమకు నీటి సమస్యను సృష్టించే అవకాశం ఉందని భయాందోళనలను వ్యక్తం చేస్తోంది.

More Telugu News