: కాసేపట్లో విక్రమ్ గౌడ్ ను అరెస్టు చేయనున్న పోలీసులు

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను కాసేపట్లో పోలీసులు అరెస్టు చేయనున్నారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడే కాల్పుల కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. పోలీసులు తనను పట్టుకోలేరని భావించిన విక్రమ్ గౌడ్ పక్కా ప్లాన్ ప్రకారం తనపై కాల్పులు జరిపించుకున్నాడని పోలీసులు గుర్తించారు. ఆరు నెలల ముందే స్కెచ్ గీసిన విక్రమ్ షార్ప్ షూటర్ కు తానే ఆశ్రయమివ్వడం విశేషం.

కాల్పుల ఘటనలో బాధితుడిగా నిలిచిన విక్రమ్ గౌడే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, విక్రమ్ గౌడ్ గత చరిత్రను తవ్వితీస్తున్నారు. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలో దందాలు, సెటిల్ మెంట్లు చేశాడని గుర్తించారు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేయగా, ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా విక్రమ్ గౌడ్, ఏ2గా నందు, ఏ3గా అహ్మద్ ఖాన్ గా, ఏ4గా రాజశేఖర్ ను పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News