: ఆ ఆరుగురిపై కేసు నమోదైంది.. రిమాండ్ కు పంపుతున్నారు: కేటీఆర్

కడ్తాల్ టోల్ గేట్ సిబ్బందిపై టీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్ లక్ష్మీ కుమారుడు మనీష్ గౌడ్ తన అనుచరులతో కలసి చేసిన దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని ప్రస్తావిస్తూ ప్రియావ్ దేశాయ్ అనే వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఇలాంటి దాడులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ కు కేటీఆర్ వెంటనే స్పందించారు. ఐపీసీ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారని... ఆరుగురు నిందితులు కస్టడీలో ఉన్నారని, రిమాండ్ కు తరలిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

కేసు వివరాల్లోకి వెళ్తే, హైదరాబాదు శివారు బీఎన్ రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ కుమారుడు మనీష్ గౌడ్ మరో ఐదుగురు స్నేహితులతో కలసి శ్రీశైలం హైవేకి వెళ్లాడు. కడ్తాల్ టోల్ ప్లాజా వద్ద వీఐపీ మార్గంలో వెళ్లేందుకు వారు ప్రయత్నించగా, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో, సిబ్బందిపై వారు దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

More Telugu News