: ఉస్మానియా ఆసుపత్రిలో సేవలు బహిష్కరించిన జూనియర్ వైద్యులు...ఇబ్బందుల్లో రోగులు

హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రి రోగులకు చాలా కష్టం వచ్చింది. ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు గత రాత్రి నుంచి సేవలు నిలిపివేశారు. గతరాత్రి 8 గంటల సమయంలో రోగుల బంధువులు తమపై దాడి చేశారని, వారిని శిక్షించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించారు. దీంతో ఆసుపత్రిలో రోగులు అల్లాడిపోయారు.

అయితే సీరియస్ కండిషన్ లోని రోగులకు సీనియర్ నర్సులు సహాయసహకారాలు అందించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు సూపరిండెంట్ ఛాంబర్ ముందు బైఠాయించారు. దీంతో అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సకాలంలో సేవలందక రోగులు అల్లాడిపోతున్నారు. దీంతో తక్షణ వైద్య సాయం కావాల్సిన రోగులు అంబులెన్సుల్లో గాంధీ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. 

More Telugu News