prabhudeva: 'బాహుబలి' సెట్లో తమిళ 'గులేబకావళి'!

'బాహుబలి' సినిమా చూసిన వాళ్లు... 'మాహిష్మతి' రాజ్యం సెట్ చూసి నోరెళ్ల బెట్టారు. అంత అద్భుతంగా రాజమౌళి ఆ సెట్ ను వేయించారు. ఈ సెట్ ను మళ్లీ చూడటం కోసమే చాలామంది మరొకసారి ఈ సినిమాను చూశారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి ఈ సెట్ లో ఇప్పుడు ఓ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది.

దర్శకుడు కల్యాణ్ తమిళంలో 'గులేబకావళి' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభుదేవా కథానాయకుడిగా, హన్సిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రేవతి కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రాజరికపు నేపథ్యంలో తెరకెక్కించవలసి ఉందట. అందువలన రాజరికపు వస్త్రధారణ, కోటతో కూడిన నగరం అవసరమయ్యాయి. దాంతో ఆ సన్నివేశాలను మాహిష్మతి రాజ్యంలో చిత్రీకరిస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు చెబుతున్నారు.  

More Telugu News