: నన్ను సాధారణ బౌలర్ అన్న రోహిత్ శర్మ అభిప్రాయం మారి ఉంటుంది...నేను అతనిని సాధారణ బ్యాట్స్ మన్ అని అనను: పాక్ పేసర్ ఆమిర్

మహ్మద్ ఆమిర్ సాధారణ బౌలర్‌ అనే అభిప్రాయాన్ని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇప్పుడు మార్చుకొని ఉండవచ్చని అతను పేర్కొన్నాడు. టీ20 వరల్డ్ కప్ కు ముందు రోహిత్ ఒక మ్యాచ్ లో రాణించడంతో అతనిని ఆకాశానికెత్తేస్తున్నారని, నాణ్యమైన బౌలరే అయినప్పటికీ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉందని...అతనిని అప్పుడే వసీం అక్రమ్ తో పోల్చడం సరికాదని పేర్కొన్నాడని గుర్తు చేసుకున్నాడు.

అప్పుడు మౌనంగా ఉన్న ఆమిర్ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తరువాత ఇన్నాళ్లకు నోరిప్పాడు. రోహిత్ అభిప్రాయం ఇప్పుడు మారి ఉంటుందని అన్నాడు. రోహిత తనను సాధారణ బౌలర్ గా పరిగణించినా సరే... ఆయన మాత్రం సాధారణ బ్యాట్స్ మన్ కాదని, రోహిత్ ఒక అసాధారణ బ్యాట్స్‌ మన్‌ అని, భారత్‌ తరఫున అతడి రికార్డులు అద్భుతం అని, రోహిత్‌ ను గౌరవిస్తానని చెప్పాడు. ఇతర క్రికెటర్లు తన గురించి ఏమనుకుంటున్నారన్నది తాను పట్టించుకోనని ఆమిర్ చెప్పాడు. కాగా, ఆమిర్ బౌలింగ్ లో 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ కేవలం 19 పరుగులే చేసి, 3 సార్లు ఔటయ్యాడు. 

More Telugu News