: మంగళగిరి ఐటీ పార్కులో 'ఫై డేటా సెంటర్'ను ప్రారంభించిన చంద్రబాబు

మంగళగిరి ఐటీ పార్కులో 'ఫై డేటా' సెంటర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రూ. 600 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, క్లౌడ్ కంప్యూటింగ్ లో ఏపీ కీలకమైన ముందడుగు వేసిందని చెప్పారు. 10 ఎకరాల్లో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశామని... దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించామని తెలిపారు.

ఫై డేటా దక్షిణాదిలోనే అతి పెద్ద 4వ శ్రేణి డేటా సెంటర్ అని తెలిపారు. క్లౌడ్ డేటాను స్టోర్ చేయడానికి మొత్తం 5వేల ర్యాక్ లను ఏర్పాటు చేశామని... వీటిలో ప్రభుత్వ అవసరాలకు 1000, ప్రైవేట్ సంస్థలకు 4వేల ర్యాక్ లను కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు హాజరయ్యారు.

More Telugu News