: సంపాదనలో బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బిజోస్

ప్రపంచ కుబేరుడిగా సుదీర్ఘ కాలంగా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ స్థానాన్ని అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బిజోస్‌ ఆక్రమించేశారు. బ్లూమ్ బెర్గ్, ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, స్టాక్ మార్కెట్ విజృంభించడంతో బిజోస్... బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టి ప్రపంచపు అత్యంత ధనవంతుడిగా అవతరించారు. గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభంలో అమెజాన్‌ స్టాక్స్ ఊహించని విధంగా 1.6 శాతం పైకెగశాయి.

దీంతో స్టాక్స్ ధర పెరగడంతో జెఫ్‌ బిజోస్‌ సంపదకు అమాంతం 1.4 బిలియన్‌ డాలర్లు జతకలిశాయి. దీంతో ఒక్కసారిగా ఆయన సంపద పెరిగిపోయింది. 2013 మే నుంచి బిల్ గేట్స్ కుబేరుడిగా నమోదవుతుండగా, 90 బిలియన్ డాలర్లకు పైగా సంపాదనతో బిలియనీర్ల జాబితాలో బిజోస్ అగ్రస్థానం అలంకరించారు. అమెజాన్.కామ్ లో బిజోస్ కు 80 మిలియన్ షేర్లున్నాయి. ఈ మధ్యే అమెజాన్ వీడియో స్ట్రీమింగ్ ప్రైమ్ ను ఆవిష్కరించారు. దీంతో అమెజాన్ విశేషమైన ఆదరణ దక్కించుకుంది. 

More Telugu News