: పాకిస్తాన్ క్రికెట్ నాశనానికి కారణం అతనే!: కమ్రాన్ అక్మల్ సంచలన ఆరోపణలు

పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్ పై మరో క్రికెటర్ కమ్రాన్ అక్మల్ విరుచుకుపడ్డాడు. వకార్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదన్న కమ్రాన్, కోచ్ గా విఫలమయ్యాడని స్పష్టం చేశాడు. పాక్ క్రికెట్ అధోగతి పట్టడానికి కారణం వకారేనని స్పష్టం చేశాడు. రెండు సార్లు కోచ్ గా పని చేసిన వకార్ వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం చేకూరకపోగా, క్రికెట్ అధోగతికి చేరుకుందని మండిపడ్డాడు. పాక్ క్రికెట్ ను మూడేళ్లు వెనక్కి నెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆటగాళ్లతో విభేదాల గురించి తనకు తెలియదని, అయితే 2015 వరల్డ్ కప్ లో జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు అతనివద్ద ప్రణాళికలు లేవని ధ్వజమెత్తాడు. యూనిస్ ను వరల్డ్ కప్ లో ఓపెనర్ గా ఎందుకు పంపాడో కూడా తెలియదని చెప్పాడు. ఆసియా కప్ లోని మ్యాచ్ లో ఉమర్ అక్మల్ సెంచరీ చేస్తే, ఆ తరువాతి మ్యాచ్ లో అతనిని కిందికి నెట్టాడని చెప్పాడు. ఇలా ఎందుకు చేసేవాడో తనకు తెలియదని, ఇలాంటి నిర్ణయాలతో పాక్ జట్టును అధఃపాతాళానికి తీసుకెళ్లిపోయాడని చెప్పాడు. కాగా, ఫిట్ నెస్ లేమి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో కమ్రాన్ అక్మల్ కు స్థానం లభించని సంగతి తెలిసిందే. 

More Telugu News