: హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో డ్రగ్స్: తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, హైదరాబాద్ ఐటీ కంపెనీల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు ఆబ్కారీ శాఖ దృష్టికి వచ్చింది. ఈ సమాచారాన్ని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏయే ఐటీ కంపెనీల ఉద్యోగులు డ్రగ్స్ వాడుతున్నారో సిట్ అధికారులు లిస్ట్ ఇచ్చారని, డ్రగ్స్ తీసుకుంటున్న వారి పేర్లను మాత్రం ఇవ్వలేదని చెప్పారు. ఆ కంపెనీల పేర్లను వెల్లడించలేమని, ఈ విషయమై ఆయా కంపెనీలను అప్రమత్తం చేశామని, వారితో మాట్లాడుతున్నామని చెప్పారు.

కొన్ని సంస్థల ప్రతినిధులను పిలిపించామని, మరి కొన్ని సంస్థల దగ్గరకు తానే వెళ్లి మాట్లాడతానని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో కంపెనీలు కచ్చితంగా నియమాలు పాటించాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పామని అన్నారు. హైదరాబాద్ లో 400 కంపెనీలు, 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని, మొత్తం ఐటీ రంగమంతా డ్రగ్స్ తీసుకుంటుందన్న ప్రచారం కరెక్ట్ కాదని జయేష్ రంజన్ అన్నారు.
   

More Telugu News