: తొలిరోజు భారత్ దే! .. భారీ స్కోరు దిశగా టీమిండియా!

గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడింది. శిఖర్ ధావన్, పుజారాలు సత్తా చాటడంతో స్కోరు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి 253 పరుగుల అత్యంత విలువైన పార్టనర్ షిప్ నెలకొల్పారు. తొలిరోజు ఆట ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది. ఆదిలోనే అభినవ్ ముకుంద్ (12) వికెట్ ను కోల్పోయినప్పటికీ, ధావన్, పుజారాలు భారీ ఇన్నింగ్స్ ను నిర్మించారు.

అనంతరం, 190 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత, బ్యాటింగ్ కు దిగిన రహానె, పుజారాకు పూర్తి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ ముగిసే సమయానికి పుజారా 144, రహానె 39 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 3 వికెట్లు తీయగా, మిగిలిన బౌలర్లు ఎవరూ వికెట్ సాధించలేకపోయారు.

More Telugu News