: 24 గంట‌ల విద్యుత్ మాకొద్దు... నిర‌స‌న తెలియ‌జేసిన యాదాద్రి జిల్లా రైతులు!

వ్య‌వ‌సాయానికి నీరు అవ‌స‌రం. నీరు పెట్టాలంటే విద్యుత్ అవ‌స‌రం. 24 గంట‌లు కరెంటు ఇస్తామ‌నే హామీ ఇచ్చిన నేత‌ల్ని రైతులు గెలిపించిన సంఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ఈ రైతులు మాత్రం 24 గంట‌లు క‌రెంటు వ‌ద్దు అంటున్నారు. త‌మ‌కు పాత ప‌ద్ధ‌తిలోనే 9 గంట‌ల విద్యుత్ చాల‌ని యాదాద్రి జిల్లాకు చెందిన కొంత‌మంది విద్యుత్ సిబ్బందిని ముట్ట‌డించారు.

ఇందుకు వారి ద‌గ్గ‌ర బ‌ల‌మైన కార‌ణం లేక‌పోలేదు. నిరంత‌రం విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం వ‌ల్ల ఎక్కువ లోతులో బోర్లు వేసిన వాళ్లంద‌రూ త‌మ మోటార్ల ద్వారా నీటిని తోడేస్తున్నారు. దీంతో త‌క్కువ లోతులో బోరు వేసిన వాళ్ల‌కు నీటి కొర‌త ఏర్ప‌డుతుంది. ఇంత‌కు ముందు ప‌ద్ధ‌తిలో విద్యుత్ ఇవ్వ‌డంలో బోరులో నీరు ఊర‌డానికి కొద్దిగా స‌మ‌యం దొరికేద‌ని రైతులు చెబుతున్నారు. న‌ల్గొండ‌, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

More Telugu News