jyothika: జ్యోతిక మరోమారు షాక్ ఇవ్వనుందట!

'చంద్రముఖి' సినిమాను చూసినవాళ్లు అంత తేలికగా జ్యోతికను మరిచిపోలేరు. ఆ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించింది .. అద్భుతం అనిపించింది.. అభినందనలు తెచ్చిపెట్టింది. అంతటి కీలకమైన పాత్రలో ఆమెను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది 'నాచ్చియార్' సినిమా.

 షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జ్యోతిక పాత్ర అత్యంత కీలకమట. ఈ పాత్ర కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు. బాలాతో పాటు సూర్య కూడా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తన పాత్ర కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుందని జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పాడు. బాలా ద్వారా తాను నటన పరంగా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నాడు. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.    

More Telugu News