: మతిమరపు భారత్ కు మరో గుణపాఠం నేర్పాలి: చైనా అధికారిక పత్రిక కథనం

భారత్ కు వ్యతిరేకంగా చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వరుస కథనాలను ప్రచురిస్తూనే ఉంది. తాజాగా యూనివర్సిటీ ఆప్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనమిక్స్ ప్రొఫెసర్ జాన్ కాంగ్ రాసిన ఆర్టికల్ గ్లోబల్ టైమ్స్ లో దర్శనమిచ్చింది. ఇందులో మతిమరుపు భారత్ కు మరోసారి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందంటూ రాయడం గమనార్హం.

 ‘‘రాజీకి భారత్ నిరాకరిస్తున్నందున దానికి రెండోసారి గుణపాఠం నేర్పాల్సిన సమయం ఇదే. డోక్లామ్ లో భారత బలగాలను స్వచ్చందంగా వెనక్కి తీసుకోవాలి. లేదంటే వారిని నిర్బంధించాలి. లేదా సరిహద్దు వివాదాలు తీవ్రతరమైతే వారిని చంపొచ్చు’’ అంటూ ఆ కథనంలో పేర్కొనడం ఆ దేశ వైఖరిని సూచిస్తోంది. చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ వైఖరిని సాధారణంగా ఈ పత్రిక కళ్లకు కడుతుందని విశ్లేషకులు చెబుతారు. భారత్, భూటాన్ బంధం తరహాలో, చైనా, పాక్ బంధాన్ని పోలుస్తూ... పాకిస్థాన్ ఆహ్వానంపై మూడో దేశం కశ్మీర్ లోకి చక్కగా ప్రవేశించొచ్చని కూడా ఈ కథనంలో రాతలు కొనసాగాయి.

More Telugu News