: అల్లుడి నిజాయ‌తీకి ట్రంప్ ఫిదా... వైట్‌హౌస్ ప్ర‌క‌ట‌న‌

ర‌ష్యా దేశ ప్ర‌తినిధుల‌తో త‌న అల్లుడు జేరెడ్ కుష్న‌ర్‌కు ఉన్న సంబంధాల‌ను వ‌క్రీక‌రిస్తున్న‌ నేప‌థ్యంలో జేరెడ్ స్వ‌యంగా వెళ్లి సెనేట్ ముందు అన్ని విషయాలను వివరించడంపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హ‌ర్షం వ్య‌క్తం చేసిన‌ట్లు వైట్‌హౌస్ ప్ర‌క‌టించింది. ర‌ష్యాతో జేరెడ్ సంబంధాల‌ను విచారించ‌డానికి నియ‌మించిన సెనేట్ సెలెక్ట్ క‌మిటీకి జేరెడ్ ప్ర‌తి విష‌యాన్ని పూస గుచ్చిన‌ట్లు చెప్ప‌డంతో ప‌రోక్షంగా పుతిన్‌కు అమెరికా రాజ‌కీయాలతో సంబంధ‌ముంద‌నే వారి ఆరోప‌ణ‌ల‌కు గట్టి సమాధానం ఇచ్చినట్టయిందని ట్రంప్ అభిప్రాయ‌ప‌డిన‌ట్లుగా వైట్‌హౌస్ మీడియా ప్ర‌తినిధి సారా శాండ‌ర్స్ తెలిపారు. అంతేకాకుండా ర‌ష్యాతో త‌న సంబంధాల గురించి జేరెడ్, సెనేట్ సెలెక్ట్ క‌మిటీకి లిఖిత పూర్వ‌క స‌మాధానం ఇవ్వ‌డంపై కూడా ట్రంప్ సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్లు శాండ‌ర్స్ చెప్పారు.

More Telugu News