: చైనా స్వరంలో మార్పు... జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటనకు స్వాగతం!

భారత్, చైనా సరిహద్దుల్లో డోక్లామ్ వద్ద ఇరుదేశాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన త్వరలో తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న డ్రాగన్ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటనకు స్వాగతం పలికింది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో చర్చలకు గాను అజిత్ దోవల్ ఈ నెల 27 నుంచి 30వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అజిత్ దోవల్ చైనా విదేశాంగ శాఖా మంత్రి, ఆ దేశ జాతీయ భద్రత బాధ్యతలు కూడా చూసే యాంగ్ జీచితో చర్చలు జరిపే అవకాశాలున్నాయి. యాంగ్, దోవల్ సమావేశం పట్ల సమాచారం లేకపోయినప్పటికీ, సదస్సుల్లో భాగంగా ఆతిథ్య దేశం సభ్య దేశాల ప్రతినిధుల మధ్య ద్వైపాక్షిక భేటీలను ఏర్పాటు చేయడం సంప్రదాయమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లుకాంగ్ తెలిపారు.

More Telugu News