Kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  ఇన్నాళ్లూ ఒకే తరహా సినిమాలు చేస్తూ వచ్చిన కథానాయిక కాజల్ అగర్వాల్ త్వరలో ఓ హారర్ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే తమన్నా, నయనతార వంటి తారలు ఇలాంటి చిత్రాలలో నటించి పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఓ ప్రముఖ దర్శకుడు తెలుగు, తమిళ భాషల్లో రూపొందించే హారర్ చిత్రంలో నటించడానికి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
*  ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును వచ్చే నెల 3 నుంచి హైదరాబాదు, రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తారు. ఇందులో బాలయ్య సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'దర్శకుడు' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆగస్టు 4న విడుదలకు సిద్ధమవుతోంది. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశోక్, ఈషా జంటగా నటించారు.
*  సూర్య ఎం.ఎస్.ఎన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సువర్ణసుందరి' చిత్రం మోషన్ పోస్టర్ మిలియన్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇందులో పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.       

More Telugu News