: ముఖేష్ అంబానీ వరాల జల్లు.. 9 ఏళ్ల గరిష్ట స్థాయికి దూసుకుపోయిన రిలయన్స్!

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వరాల జల్లు కురిపించారు. జియో కొత్త ఫోన్లు, అన్ లిమిటెడ్ డేటా, అన్ లిమిటెడ్ టాక్ టైమ్, ఫోన్ టు టీవీ కనెక్టివిటీ ఇలా ఎన్నో కొత్త కార్యక్రమాలను, పథకాలను ఆయన ప్రకటించారు. మరోవైపు, ఈ త్రైమాసికంలో విశ్లేషకుల అంచనాలను మించి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 9,108 కోట్ల నికర లాభాన్ని పొందింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో ఇది 28 శాతం ఎక్కువ. ఈ నేపథ్యంలో, స్టాక్ మర్కెట్లలో రిలయన్స్ షేర్లు దూసుకుపోయాయి. ప్రస్తుతానికి ఒక్కో షేరు ధర 4 శాతం పెరిగి, 9 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. బీఎస్ఈలో కంపెనీ షేరు విలువ 3.85 శాతం, ఎన్ఎస్ఈలో 3.86 శాతం పెరిగింది.   

More Telugu News